ఇటుక

ఇటుక

ఇటుక
మతజాడ్యపు మారణకాండకు కూలిందా ఇటుక
ధార్మిక జీవన ద్రష్టల పోరులొ కలిసిందా ఇటుక
జుట్టుకి బొట్టుకి పన్నులుకట్టి బతికిందా ఇటుక
ఉత్సూరము నిరాశలో కన్వేగును చుసిందా ఇటుక
రుధిరము మడుగులో పిడికిలినెత్తినదా ఇటుక
అర్ధరాత్రి వేల్పులప్రతిష్ట చూసిందా ఇటుక
పదులయేళ్ళు పందిరికింద నలిగిందా ఇటుక
కరసేవకుల కరములలో ఊరేగిందా ఇటుక
ఇక్ష్వాకు కులపతి ఇంటిలో కలువగ
లౌకిక కాఱుల బందనములు తెంపగ
హైందవ ఐక్యతన శంఖుస్థాపనకై నేడు
నిలిచిందీ ఈ ఇటుక , వందల వర్షములైనా ధర్మము విడువకా