ఒకటి

ఒకటి

ఒకటి
పెద్దలుజెప్పిన మాటొకటుంది
విని నేర్చు తరమొకటుందా?
దైవం ఇచ్చిన జన్మకొటుంది
పరమార్ధం వెతికే బుద్దొకటుంది ?
సఖ్యత పెంచే చేతొకటుంది
స్వార్ధం విడిచే మనసొకటుందా ?
శాంతిని నిలిపే భావమొకటుంది
అణచివేత లేని సంఘమొకటుందా ?
విజ్ఞత నేర్పే విద్యకొటుంది
ధనముకు లొంగని దారొకటుందా ?
ప్రేమను పంచే అమ్మకొటుంది
బంధం విడువని బాధ్యత ఉందా ?
దేశం ఇచ్చిన స్వేచ్ఛొకటుంది
చరితను మరవని జాతొకటుందా?
సంఘం ఇల్లను సాధనొకటుంది
సేవను జేసే చేయకొటుందా ?
మూక్తిని ఇచ్చే వేదమొకటుంది
భక్తితొ నిండిన ప్రార్ధనొకటుందా ?
మనసున రగిలే ప్రశ్నొకటుంది
తృప్తిపరిచే జాబొకటుందా ?
ఓ భరతా , వెతుకు అంతా ఉండీ నీలో ఉన్న ఆ ఒక్కదానికొరకు
మధించు, శ్రమించు , అతనుకలిసిననాడు జ్ఞానభాస్కర కిరణం జీల్చు నీ అంధకారం.