జెండా

జడుచు గుండెలనదరకుండా
తట్టి నిలిపిన జయము జెండా
బానిసత్వపు బతుకునిండా
ఆత్మగౌరవమద్దె జెండా
గన్ను గుండుకు కాలకుండా
వెన్నుచూపని తెగువ జెండా
వీరరక్తము మడుగునిండా
దేశభక్తిని చూపె జెండా
ఆడపడుచులనాపకుండా
పీఠమిచ్చిన ప్రగతి జెండా
భాషలెన్నో చరితనిండా
భావమొక్కటని తెలిపె జెండా
ప్రజలరాజ్యము చీలకుండా
జనుల నడిపిన జాతి జెండా
రంగురూపు కానకుండా
రక్షనిచ్చిన రాజ్య జెండా
నింపు నింపు మనసు నిండా
చచ్చెదాకా మరవకుండా
తట్టి నిలిపిన జయము జెండా
బానిసత్వపు బతుకునిండా
ఆత్మగౌరవమద్దె జెండా
గన్ను గుండుకు కాలకుండా
వెన్నుచూపని తెగువ జెండా
వీరరక్తము మడుగునిండా
దేశభక్తిని చూపె జెండా
ఆడపడుచులనాపకుండా
పీఠమిచ్చిన ప్రగతి జెండా
భాషలెన్నో చరితనిండా
భావమొక్కటని తెలిపె జెండా
ప్రజలరాజ్యము చీలకుండా
జనుల నడిపిన జాతి జెండా
రంగురూపు కానకుండా
రక్షనిచ్చిన రాజ్య జెండా
నింపు నింపు మనసు నిండా
చచ్చెదాకా మరవకుండా