దండనాయకుడు హిరణ్యకశిపునకి తెల్పుట

ఉ|
కాయముక్రక్కసంబుదిన గానముజేసెను శ్రీహరిన్ విధా
మాయముజేసి సర్పములమాలలు దారగ గట్టే వింతగన్
పేయువుమధ్యముంచినను మేధినినడ్చిన తీరు వచ్చె యా
ప్రాయము జూసి నమ్మకుసుమా హరిగాచును బాలునెప్పుడున్
కాయముక్రక్కసంబుదిన గానముజేసెను శ్రీహరిన్ విధా
మాయముజేసి సర్పములమాలలు దారగ గట్టే వింతగన్
పేయువుమధ్యముంచినను మేధినినడ్చిన తీరు వచ్చె యా
ప్రాయము జూసి నమ్మకుసుమా హరిగాచును బాలునెప్పుడున్
🌍 Translations
❋ ❋ ❋
హిరన్యకశిపుని ఆక్రోశము

కం||
నొప్పనవు యెంతగొట్టిన
చెప్పిన వినవుగ వలదని శ్రీహరి పొగడన్
తప్పుకు తిరుగుట చాలిక
ఒప్పుగ నాముందుజూపు మొక్కరమందున్
నొప్పనవు యెంతగొట్టిన
చెప్పిన వినవుగ వలదని శ్రీహరి పొగడన్
తప్పుకు తిరుగుట చాలిక
ఒప్పుగ నాముందుజూపు మొక్కరమందున్
🌍 Translations
❋ ❋ ❋
హిరన్యకశిపుని ఆక్రోశము

తే.గీ||
జననమరణాలకు విధి చక్ర ధరుడు
పాపపుణ్యములనుత్రూచు పావకుండు
సృష్టి క్రమమునునిర్ధించు సాక్షి విభుడు
అడగనేల? కలండన్నికడల తండ్రి
జననమరణాలకు విధి చక్ర ధరుడు
పాపపుణ్యములనుత్రూచు పావకుండు
సృష్టి క్రమమునునిర్ధించు సాక్షి విభుడు
అడగనేల? కలండన్నికడల తండ్రి
🌍 Translations
❋ ❋ ❋
హిరన్యకశిపుని ఆక్రోశము

కం||
రమ్మను వైరిని జంపెద
నమ్మిన నినుబ్రోవగొచ్చునని నమ్మెదరా
సుమ్ముగ కక్షను దీర్చెద
దమ్ములు గలవే రణమున తలపడనాపై
రమ్మను వైరిని జంపెద
నమ్మిన నినుబ్రోవగొచ్చునని నమ్మెదరా
సుమ్ముగ కక్షను దీర్చెద
దమ్ములు గలవే రణమున తలపడనాపై
🌍 Translations
❋ ❋ ❋
నృసింహావిర్భావం

చం||
పటపట స్తంభమున్ విరుగ ప్రాగ్ధిశ భానుని కాంతి తేజమై
జటములు విస్తరింప దిగె ఛాగరథుండు హిరణ్య వైరిగన్
దిటమరి గెంతె జాళెముగ దెంచగ కర్వరుని గర్వమంతయున్
గటగట త్రాగె రక్తము నఖంబుతొజీల్చి నృసింహుడుగ్రుడై
పటపట స్తంభమున్ విరుగ ప్రాగ్ధిశ భానుని కాంతి తేజమై
జటములు విస్తరింప దిగె ఛాగరథుండు హిరణ్య వైరిగన్
దిటమరి గెంతె జాళెముగ దెంచగ కర్వరుని గర్వమంతయున్
గటగట త్రాగె రక్తము నఖంబుతొజీల్చి నృసింహుడుగ్రుడై