తను

          ఉ||
బంగరు ఛాయజుట్టు శితి పంకజబోలు కపోలముల్ భలే
కృంగిన నుత్పలాసనపు కించనకంఠము కారుమేఘమో
భంగిమవోలె వక్షములు వాగులవంకల దీటు కౌను గో
పాంగన మందహాసము ముభావమునున్న మనస్సు దోచనే

🌍 Translations
❋ ❋ ❋
నా మది ప్రేరణ

          శా||
లేదే నీయదరాంమృతంబులను గ్రోలే భాగ్యమీజన్మలో
పోదే నామదివీడి నీ తలపులే పొమ్మంచు వాదించినా
రాదే కాలముచుట్టి నిన్నుకలిసే రమ్యానుభావంబు వే
రేదే నీవదనంబుగాక మది ప్రేరేపించగన్ ప్రేయసీ

రాసలీలాలాపన

          ఉ||
కాలము దాటుచున్నదని కాంక్షలనుప్పెనపైన మౌన మో
జాలము వేసి పట్టినది చక్కనికన్నులదాన నీదు భా
వాలను కస్సుబుస్సుల విభావరి దాటుచు చుంబనాశయా
కేళికి రాసవేదికలకేగు ప్రియుండుని బ్రోవు ప్రేయసీ

ఆలస్యమెందుకా?

          శా||
ఆ జీమూతము కేశలాస్యమగ సూర్యాభిఖ్య దృక్జాలమై
రోజంతా నినుజూచు కోరికతొ సారూప్యంబులన్ గాంచి నా
కేజామైనదొ తెల్యదాయె సఖి నీక్రీడావిలాసంబులో
రాజిల్లే మధురానుభూతిచని నే రానైతినే వేళకున్

సొగసుపొగడ తరమా

          శా||
వీణానాథము నీదు పల్కులు మహావిన్యాస కాకోలమే
మానోజ్ఞంబగు నీదుసోగ జడ జామల్లెల్ వికాసించు ప్రొ
ద్దైనా నీ దరహాసమొప్పగ వనోద్యానంబునా యింద్ర భా
మానిర్వాకములోడిపోవును ని కామావేశమౌనంబునన్

మన్మథకేళీ

          చ||
నిలువగలేక హాసవృతనిర్మలచక్షుకృపాణ ధాటికిన్
కలువలసాటి నీదు మృదుకాయముజూసి వినీలచంద్ర కాం
తులసరి నాదుమోహము మతోత్తరతంత్రమువేసి లాగు వే
ళలొ రతిమన్మథుల్ చనని లాస్యమునేర్చిరి దేవలోకమున్

నీ ప్రియుడను కీర్తి

          ఆ.వె||
భుజము భుజము తాకి నిజమిదని తెలిపె
మాట మాట కలిపి మనసుజారె
కలిసి గడుపు సమయకౌగిలి వదులక
బ్రాతిలోన నేటి రాత్రి నడిచె
తే.గీ||
చేయి తాకిన మృదువుగ హాయికలిగె
చందురుని మేను స్పర్శయో యిందువదన
చెలిమి నీవని నవ్వుతు చెవిలొ జెప్ప
పురుష సింగమన్నెడి కీర్తి పొసగెనాకు
ఆ.వె||
పోర యనుచు నీవు చిలిపి పొగరుజూప
ఛీచి తుంటరోడవనుచు సిగ్గు జూప
నీతొ సమయము తెలియదని తలమొట్టి
నవ్వ ఈర్ష్యపడె జగము నన్నుజూసి
భుజము భుజము తాకి నిజమిదని తెలిపె
మాట మాట కలిపి మనసుజారె
కలిసి గడుపు సమయకౌగిలి వదులక
బ్రాతిలోన నేటి రాత్రి నడిచె
తే.గీ||
చేయి తాకిన మృదువుగ హాయికలిగె
చందురుని మేను స్పర్శయో యిందువదన
చెలిమి నీవని నవ్వుతు చెవిలొ జెప్ప
పురుష సింగమన్నెడి కీర్తి పొసగెనాకు
ఆ.వె||
పోర యనుచు నీవు చిలిపి పొగరుజూప
ఛీచి తుంటరోడవనుచు సిగ్గు జూప
నీతొ సమయము తెలియదని తలమొట్టి
నవ్వ ఈర్ష్యపడె జగము నన్నుజూసి
🌍 Translations
❋ ❋ ❋
మాయలేడి

          మ||
బహుశా నీవొక మాయలేడివొ మనోభావాలరణ్యంబులో
విహరింపంగ వినీలదృశ్యమును నే వీక్షించితిన్ యద్భుతా
రహమై యున్నటి నడ్ము తాకగ కరాగ్రంబెల్ల యత్నించగన్
మొహమాటంబున చెంగుగప్పి మరుగై పోయింది నీరూపమే

ఈర్షావేశమా?

          ఉ||
నవ్వుతు మాటలాడినని నాముఖనెప్పుడు జూడనంచులే
జివ్వున కోపగించితివి చెక్కిలికందెను జూడు నీకు ఏ
పువ్వులధీటుగావు మదిపోల్చిన అప్సరసాదులైన ఏ
గవ్వకు సాటిరారు ననుగప్పినమేఘము నీవు ప్రేయసీ

నీ ప్రియుడను నేను

          ఉ||
చాలదు విశ్వమంత గెలిచాననుకీర్తి కుభేరుడన్ననూ
చాలదు విక్రమార్కరణసత్తువసాటి పరాక్రమన్ననూ
చాలదు సత్యదీక్షగుణసౌమ్యుడు రాసపురేంద్రుడన్ననూ
చాలదు నా మనస్సునిలు చంద్రిక “నా ప్రియడ”న్న ఖ్యాతికిన్

మనము

          కం||
కనులాయవి కవి కలమున
జనియించిన కల్పనాశశాంక రుచిరమా
తనువా యది కమలాసడు
తన ప్రతిభనుజూపనిడిన ద్రవ్యాధ్భుతమా
శా||
అందంబంతయు నీవశంబనుచు నీ అవ్యాజనంగీకృతీ
బంధంనిర్జరపానమై వెలుగు నీ భామాకలాపంబునా
బంధీనైతిని కర్మధర్మగుణసావాసంబుకై తోడుగా
గ్రంథంబుల్ కలిపెన్ మనిద్దరిని దీర్ఘాయుష్షుతో ప్రేయసీ