ఒకనాడు

సీ||
ఒకనాడు సత్యశోధకులలొ జిజ్ఞాస
నీపదమందు రాణించి వెలిగె
ఒకనాడు ధర్మపాలకుల శాసనము నీ
భోగములకు సాక్షిభూతమయ్యె
ఒకనాడు విశ్వనరోత్తముల్ పయనించె
నీ ధూళితాకంగ నిశ్చయముగ
ఒకనాడు నిత్యదీపికల వాజ్ఞ్మయము నీ
దయవల్ల ప్రభవించె దశదిశలకు
తే.గీ||
మానవాళికి మనుగడ మార్గమిచ్చి
వెలుగు రేఖలు ప్రసరించు విశ్వజనని
నీ ప్రచండ పోరాటముల్ నీదుఘనత
భవ్య చరితపొగడ తరమె భరతమాత
ఒకనాడు సత్యశోధకులలొ జిజ్ఞాస
నీపదమందు రాణించి వెలిగె
ఒకనాడు ధర్మపాలకుల శాసనము నీ
భోగములకు సాక్షిభూతమయ్యె
ఒకనాడు విశ్వనరోత్తముల్ పయనించె
నీ ధూళితాకంగ నిశ్చయముగ
ఒకనాడు నిత్యదీపికల వాజ్ఞ్మయము నీ
దయవల్ల ప్రభవించె దశదిశలకు
తే.గీ||
మానవాళికి మనుగడ మార్గమిచ్చి
వెలుగు రేఖలు ప్రసరించు విశ్వజనని
నీ ప్రచండ పోరాటముల్ నీదుఘనత
భవ్య చరితపొగడ తరమె భరతమాత
🌍 Translations
❋ ❋ ❋
ధర్మధాత్రి

ఉ||
తల్లివి తత్వ వేత్తల సదార్థ మరాళివి వీరధాత్రివిన్
చిల్లిన రక్తమున్ పరువశించిన కాళివి నిత్యశోభివిన్
జల్లిన శాంతిమంత్రముల శక్తివి జాగృత ధర్మజాతివిన్
తెల్లని కాంతినల్లిన ప్రదీప్త గుణాగ్రుల భారతాంబవే
తల్లివి తత్వ వేత్తల సదార్థ మరాళివి వీరధాత్రివిన్
చిల్లిన రక్తమున్ పరువశించిన కాళివి నిత్యశోభివిన్
జల్లిన శాంతిమంత్రముల శక్తివి జాగృత ధర్మజాతివిన్
తెల్లని కాంతినల్లిన ప్రదీప్త గుణాగ్రుల భారతాంబవే
🌍 Translations
❋ ❋ ❋
సడలని భావజాలము

సీ||
నినుమార్చు తానంటు నీపైకి యరబులై
యల్లాను రుద్దంగ యాక్రమించె
నినువంచు తానంటు నీపైకి ఆంగ్లులై
పెత్తనంబేలగ పేరుమార్చె
నినుచంపు తానంటు నీపైకి మ్లేచ్ఛులై
ఎర్రజెండాలతొ విర్రవీగె
నినుగూల్చుతామంటు నీపైకి క్రూరులై
మారణహోమాల మంటబెట్టె
తే.గీ||
ఎన్నిజేసిన గాని నీ వెన్నుగనరె
రక్తతర్పణ మిచ్చిన రాచశక్తి
మస్తకంబులు దెగినను మారలేదు
పిడికిలెత్తిన పసిపాప బిగువుచాలు
భావజాలము చావదే భరతమాత
నినుమార్చు తానంటు నీపైకి యరబులై
యల్లాను రుద్దంగ యాక్రమించె
నినువంచు తానంటు నీపైకి ఆంగ్లులై
పెత్తనంబేలగ పేరుమార్చె
నినుచంపు తానంటు నీపైకి మ్లేచ్ఛులై
ఎర్రజెండాలతొ విర్రవీగె
నినుగూల్చుతామంటు నీపైకి క్రూరులై
మారణహోమాల మంటబెట్టె
తే.గీ||
ఎన్నిజేసిన గాని నీ వెన్నుగనరె
రక్తతర్పణ మిచ్చిన రాచశక్తి
మస్తకంబులు దెగినను మారలేదు
పిడికిలెత్తిన పసిపాప బిగువుచాలు
భావజాలము చావదే భరతమాత