మరువవెందుకే మనసా

మరువవెందుకే మనసా

మరువవెందుకే మనసా
మరువవెందుకే మనసా
నినువిడి సెలవని కదిలిన జ్ఞాపకాలు
యదసడి విననని తెలిపిన భేషజాలు
చెరిపిన కథయని తెలిసి , కలయని తలచి
మరువవెందుకే మనసా
అబ్బాయి:
నీచూపులేక పొద్దు పొడిచిన, నీమాట వినక నిద్దురొచ్చిన
నీతో దూరం కలిసి నడిచిన , నిన్ను తాకి తనువు మురిసిన
కాలమే ఖైదులా మారెనా
ప్రేమకన్న మిన్న లేదని నీవన్నవన్ని యిక నావని
అన్ననాడు కలిసున్న ‘నాడు’ హాయిగా
ఒక్కనాడు హద్దు గీసిన ప్రేమమిద్దెలిక కూలెనా
పంచుకున్న నీపై పెంచుకున్న ఆశ రాలగా
మగాళ్ళు విసిగినా క్షణములో చెంతచేరులే
వడగళ్ళు రాలిన క్షణములో నీటజారులే..
అమ్మాయి:
నిన్నుకాని సంధ్యలేదులే , నీ నవ్వు గుచ్చు గుండుసూదులే
నాయిష్ట మన్నదిక నీవులే , కష్టపెట్టె దాన్ని లేనులే
కాలమే స్వప్నమై కాలెనా
చిలిపి పనులన్ని చేసినా చిన్న పిల్లలాగ మారినా
నీతోఉన్నన్నాడు కన్నవారినైనా మరిచినా
మంచిచెడులన్ని పంచినా నాగుర్తులన్ని నీవు చెరిపినా
నిన్నువీడలేక నన్ను మార్చలేక యిల నలిగినా
మగువ పెదవి దాటని మధనాల ఊసులెన్నిలే
కడలి దరికి చేరని కెరటాల లెక్కలేదులే
మరువవెందుకే మనసా…