రైతు

రైతు

రైతు
వరి వేలుపు వెలుగు కొరకు వెల వెల పోయిన నేలను చూసి,
అలలను మ్రింగి చినుకులు కక్కని మేఘాన్ని మొట్టికాయ వేసి దించాలని ఉంది,
కరువుని మాపలనిఉంది,
వలసని ఆపాలని ఉంది !
కలలగూడు పొద్దుగడుచుటకు అప్పుఖంబులో ఎగిరిపోయి,
శావుకారి శాసనాలకింద ,
వడ్డీలతో స్నేహంచేసి ,
రెక్కలనమ్ముకున్న కపోతాన్ని విడిపించాలని ఉంది,
ఊరిలో బతుకియ్యాలని ఉంది, స్వేచ్ఛ రుచిచూపలని ఉంది !
రేపటి కలలకు నిచ్చెన వేసి, కడుపుల కన్నిరంతా దాచి,
ఆలికి అమ్మకి జ్ఞాపకమిచ్చి ,
మదిలో బారం దుబాయి దూరం దీర్చునని పోయిన బిడ్డని వెతకాలని ఉంది,
అడిగిన అమ్మతొ కలపాలని ఉంది,
ఆలికి ఆత్మను ఇయ్యాలనిఉంది
నాగలినేస్తం ఎందుకుదాస్యం
కలోగంజోకలిసి తిందామంటు గల్ఫ్ లగల్లంతై
దళారిదాష్టిక దారిలో మాయమై
కాసుల ఎండమావిలో దప్పికున్న అన్నలని చూడాలనిఉంది , రమ్మని పిలవాలనిఉంది !