గోదావిర్భావం

గోదావిర్భావం

గోదావిర్భావం
మంగళమహశ్రీ||
వందనము వందనము పాడుకొను పాశురము స్వామినుతి భాసురము తల్లీ
సుందరము సుందరము సూక్తులకు మందరము శోభనము నీవ్రతము తల్లీ
అందముగకందుమిక అంతరము నందసుతనాకృతిగ నీకృతిని తల్లీ
అందరము పొందదగు నచ్యుతుని బంధమును అందివగ పుట్టితివ తల్లీ