ముకుంద

ముకుంద

ముకుంద
పుట్టినవయ్య కటకటాలలో
బుట్టలొ దాటితివి యమునను
మెట్టుగ చేరె రెపల్లె
కనికట్టుగ దోచితివి నవనీతముల్
గట్టిగ తైతక్కలనాడె సర్పపు సిరమున్
పట్టున పిడిగుద్దుల కురిపించి కంసనాసనముకు
జట్టుగ గోపస్త్రీలను గాచితివి కృష్ణా
కురుసభలో నిల్పితివి సోదరి మానము
కౌంతేయుల భారము నెత్తినమొసితివి
కౌరవాగ్రణికి జెప్పక జెప్పితివి నీతికుశముల్
సమరమునందు పార్ధునికిచ్చితివి జనుల గీత
ధర్మములను వదలి నీపై భారము పెట్టువానికి
విహితకర్మలను బాపి మొక్షమిచ్చెదవంటివి భయంబు మాకేల నయ్యా ముకుందా నీ పదసంసేవ్యమునందు నుండగా