విఘ్ననివారణదేవ

తే.గీ||
విఘ్నములనాపు దేవుడా వివిధ భక్ష
పాయస కుడుములంబెట్టి భక్తితోడ
పూజలను జేయుభారత భూమినెపుడు
కయ్యమున వియ్యమున గెల్వనియ్యవయ్య
విఘ్నములనాపు దేవుడా వివిధ భక్ష
పాయస కుడుములంబెట్టి భక్తితోడ
పూజలను జేయుభారత భూమినెపుడు
కయ్యమున వియ్యమున గెల్వనియ్యవయ్య
🌍 Translations
❋ ❋ ❋
కాణిపాక వినాయక

శా||
వెలిసెన్ బావిలొ కాణిపాకమున ఈ వేదావనిన్ బ్రోవగా
వలచెన్ పార్వతి పుత్రుడే కుడుము నేభక్షాలనాశ్వాదగా
నిలిచెన్ విద్యల కెల్ల దృంబువుగ యానేతవ్య శాస్త్రాలలో
పలికెన్ విఘ్నములాపురేడు జగముధ్భావాల సారంబులే

మార్గమిడు గణేశా

ఉ||
తొండముజాపి మా మదిని దూరెడి ఆసురభావసారముల్
దండిగ జుఱ్ఱువయ్య వివిధాశలనిచ్చెన వేయు బుద్ధికిన్
అండగ నిల్వవయ్య నిగమాంతరసూక్ష్మము నేర్చు జన్మలో
నిండిన ఈర్ష్యకోపముల నెగ్గెడిమార్గమిడో గణాధిపా

విష్వక్సేన ప్రభో

శా||
శ్రీవైకుంఠుని వాసమందుమసిగే సేవాత్ములెవ్వారి యా
జ్ఞావాసంబును మీఱబోరు,ప్రతిజిజ్ఞాసుల్ విరాజిల్లు ధ
ర్మావాసంబున విఘ్నముల్ నుఱుచు రారాజెవ్వడున్ భావ వి
శ్వావాహిన్ నడిపే పడాలుడగు విశ్వక్సేనుకిన్ మ్రొక్కెదన్

పరకాల మునీశ

చ||
దళపతి విష్ణుసేవ నిరతి ధర్మ సుభాషితరక్తి నిత్య ప్రా
బలుకుల వేత్తి భీషణ కృపాణపుకాంతి ధర్మమార్గమున్
విలసిత చోరనీతి హరివిప్రుల సేవజనార్థి వైష్ణవా
గ్రుల కడుమేటి పాలుషిరీతి పరకాల మునీశ వందనం